Back to FeedQuickToday Shorts

General
Oct 5, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మేడిపల్లిలో గోల్డ్, డైమండ్స్ షాపులో భారీ చోరీ
మేడిపల్లి, అక్టోబర్ 05 (క్విక్ టుడే న్యూస్):
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని వరంగల్ ప్రధాన రహదారిపై ఉన్న క్యారెట్ లేన్ గోల్డ్ డైమండ్స్ షాపులో భారీ చోరీ జరిగింది.
సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు షాపు షట్టర్‌ను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
షాపులో ఉన్న భారీ మొత్తంలో బంగారం, వజ్రాభరణాలను దుండగులు అపహరించినట్లు సమాచారం.
చోరీపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
షాపులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.



