Back to FeedQuickToday Shorts

District
Aug 9, 2026Short Read
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి...
మహబూబాబాద్ జిల్లా భారీ వర్షాలు, తుఫానుల నేపథ్యంలో తొర్రూరు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్‌కుమార్ సూచించారు.
వర్షాల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.విద్యుత్ తీగలు, స్తంభాలను తాకవద్దని,విద్యుత్ స్తంభాలకు కట్టిన వైర్లను పట్టుకోవద్దని సూచించారు.
వర్షాల సమయంలో విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బందిని సంప్రదించాలని కోరారు.పట్టణ ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని చైర్మన్ తెలిపారు.





