Back to FeedQuickToday Shorts

District
Oct 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు
జనగామ, అక్టోబర్ 21 (క్విక్ టుడే న్యూస్):
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జనగామ పట్టణంలో పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఐపీఎస్ ఆధ్వర్యంలో సీఐ జనగామ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల రక్షణ కోసం వారు చేసిన సేవలు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.



