
న్యాయవాదులపై దాడులు సరికాదు
తొర్రూర్ బార్ అసోసియేషన్ నిరసన
తొర్రూరు, ఆగస్టు14(క్విక్ టుడే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నాగర్‌కర్నూల్ జిల్లా సీనియర్ న్యాయవాది ఎం.వేణుగోపాలరావుపై కక్షిదారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరత్నం మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులు చేయడం సరికాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దాడికి పాల్పడిన వారి తరఫున న్యాయవాదులు వాదించకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న న్యాయవాదుల సంరక్షణ చట్టం ప్రకారం న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాగేశ్వర్,ట్రెజరర్ ఉపావతి,న్యాయవాదులు రఘురామ్‌రెడ్డి, వలపు మధుసూదన్, ప్రవీణ్‌రాజు, బి.వెంకన్న, శ్రీధర్, విజయ ,ఘణపురం రామకృష్ణ, అశోక్, గోపాల్ ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.





