
11 కిలోల లడ్డూ లక్కీ డ్రా విజేతగా అరూరి అక్షయ్
పాలకుర్తి, సెప్టెంబర్ 23 (క్విక్ టుడే న్యూస్):
సర్వాయి పాపన్న విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లోభాగంగా 11 కిలోల లడ్డూ లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ భరత్ సుమన్ హాజరై లక్కీ డ్రాను నిర్వహించారు.లక్కీ డ్రాలో టోకెన్ నంబర్ 1627విజేతగా నిలిచింది. ఈ టోకెన్‌కు చెందిన అరూరి అక్షయ్, తండ్రి రవి కుమార్ 11 కిలోలలడ్డూను గెలుచుకున్నారు. విజేతను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడంతో నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న విఘ్నేశ్వర కమిటీ సభ్యులు మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులతో లక్కీ డ్రాలో విజయం సాధించిన అరూరి అక్షయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రాను నిర్వహించి, కార్యక్రమం విజయవంతంగాజరిగేందుకు సహకరించిన సీఐ భరత్ సుమన్‌కు కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



