
లారీ ఢీకొని దెబ్బతిన్న విగ్రహం.. వర్షానికి నేలమట్టం
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
తొర్రూరు సెప్టెంబర్ 24(క్విక్ టుడే న్యూస్)
నాలుగు రోజుల క్రితం లారీ ఢీకొనడంతో పాక్షికంగా దెబ్బతిన్న బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిగా ధ్వంసమైంది.
తొర్రూరు పాలకేంద్రం చౌరస్తాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నాలుగు రోజుల క్రితం లారీ ఢీకొనడంతో విగ్రహం బేస్ పాక్షికంగా దెబ్బతిని పక్కకు ఒరిగింది.
అప్పటి నుంచి అధికారులు,ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మరమ్మతులు చేపట్టలేదు.
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి విగ్రహం నేలకొరిగి పూర్తిగా ధ్వంసమైంది.విగ్రహం దెబ్బతిన్న విషయం తెలిసినా అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి విగ్రహాన్ని పునరుద్ధరించాలని,ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



