Back to FeedQuickToday Shorts

General
Sep 5, 2026Short Read
యశ్ 'టాక్సిక్' ఇంగ్లీష్ వెర్షన్‌కు చుక్కెదురు.. దేశవ్యాప్తంగా వసూళ్లు రూ.1.40 లక్షలే!
నిన్న ఇంగ్లీష్ భాషలో విడుదలైన హీరో యశ్ 'టాక్సిక్' చిత్రానికి ఊహించని షాక్ తగిలింది.
దేశవ్యాప్తంగా ఈ వెర్షన్‌కు కేవలం 450 టికెట్లు మాత్రమే అమ్ముడవగా, రూ.1.40 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
సుమారు రూ.500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, గత నెల 26న విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని ఇప్పటివరకు ఈ సినిమా రూ.330 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.





