Back to FeedQuickToday Shorts

General
Aug 23, 2026Short Read
బిగ్ బాస్-10: వినపిస్తున్న కంటెస్టెంట్ల పేర్లు!
సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న బిగ్‌బాస్-10 సీజన్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో ప్రముఖంగా 'ఆటో' రాంప్రసాద్ పేరు వినపిస్తోంది. ఆయన హౌస్‌లోకి వెళితే తనదైన శైలిలో పంచులతో ఎంటర్టైన్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
రాంప్రసాద్‌తో పాటు యాంకర్ వర్షిణి, సీరత్ కపూర్, జబర్దస్త్ నరేష్, బుల్లితెర నటి సుహాసిని తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సామాన్యులకు కూడా అవకాశం కల్పించేందుకు 'అగ్నిపరీక్ష-2' పేరుతో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే అధికారికంగా కంటెస్టెంట్ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.





