Back to FeedQuickToday Shorts

General
Aug 4, 2026Short Read
బిగ్బాస్-10 అప్డేట్: ఆగస్టు 15 నుంచి ‘అగ్నిపరీక్ష’ ప్రారంభం!
క్విక్ టుడే న్యూస్, ఆగష్టు 4 :- బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్బాస్ సీజన్-10 సిద్ధమవుతోంది.
ఈ మేరకు ‘స్టార్ మా’ కీలక అప్డేట్ అందించింది.
ఆగస్టు 15 నుంచి ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
గత సీజన్ విజేత కళ్యాణ్ పడాల ఈ తేదీని రివీల్ చేయడం విశేషం.బిగ్బాస్ హౌస్లోకి ప్రవేశించాలనుకునే సామాన్యుల (కామన్ పీపుల్) కోసం నిర్వహించే ఆడిషన్ ప్రక్రియే ఈ ‘అగ్నిపరీక్ష’.
గత సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా బిందు మాధవి, అభిజీత్, నవదీప్ న్యాయనిర్ణేతలుగా (జడ్జీలుగా) వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.
మరింత సమాచారం త్వరలో వెలువడనుంది.





