Back to FeedQuickToday Shorts

General
Aug 20, 2026Short Read
సంక్రాంతి బరిలో వెంకటేష్, కళ్యాణ్ రామ్.. 'జనవరి 12 విడుదల'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌గా వస్తున్న సినిమా టైటిల్ ఖరారైంది.
ఈ సినిమాకు విభిన్నంగా 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను, 'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనే ట్యాగ్‌లైన్‌ను చిత్రబృందం ప్రకటించింది.
పేరుకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు.
ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సంక్రాంతికి భారీ అంచనాలతో ఈ కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది.





