Back to FeedQuickToday Shorts

General
Aug 3, 2026Short Read
ఇకపై ఆ రోల్స్ చేయను, కానీ 'జైలర్-2'కి మినహాయింపు: విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం!
క్విక్ టుడే న్యూస్, సినిమా :- ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై తాను సినిమాల్లో అతిథి పాత్రలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
అయితే, సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఉన్న అభిమానంతోనే 'జైలర్-2' చిత్రంలో ఒక చిన్న పాత్ర చేయడానికి అంగీకరించినట్లు తెలిపారు.పెద్ద సినిమాల్లో తన పోస్టర్ వేసినా, ప్రేక్షకుల దృష్టి రజనీకాంత్ వంటి అగ్ర హీరోల పైనే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
అదే చిన్న సినిమాల్లో తాను అతిథి పాత్ర చేస్తే, తన పోస్టర్ తోనే ఆ సినిమాలకు మార్కెటింగ్ చేసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలాంటి పరిణామాలు తాను హీరోగా నటిస్తున్న సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విజయ్ సేతుపతి వివరించారు.
కాగా, ప్రస్తుతం ఆయన 'స్లమ్ డాగ్' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.





