Back to FeedQuickToday Shorts

General
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
'జాంబీరెడ్డి-2'లో ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర: భయంకరమైన వారియర్ లుక్ వైరల్
తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ 'జాంబీరెడ్డి-2 NXT LVL' చిత్రం నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
రియల్ స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన స్పెషల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్లో ఉపేంద్ర ఓ ఆయుధం పట్టుకుని చెట్టు పైనుండి తలకిందులుగా వేలాడుతూ పవర్ఫుల్ వారియర్‌గా కనిపిస్తున్నారు.ఈ జాంబీల ప్రపంచంలోకి ఉపేంద్ర లాంటి స్టార్ రాకతో సినిమా నెక్స్ట్ లెవల్‌కు చేరుకుందని చిత్ర బృందం పేర్కొంది.
తాజాగా వచ్చిన ఈ క్రేజీ అప్డేట్ ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది.
Tags:#General#National#Shorts





