Back to FeedQuickToday Shorts

General
Aug 4, 2026Short Read
ఏఐ ఎఫెక్ట్: నెలకు ₹2 లక్షల నుంచి ₹40 వేలకు పడిపోయిన కాపీరైటర్ జీతం!
క్విక్ టుడే న్యూస్, తెలంగాణ :- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు, ఆదాయం ఏ విధంగా దెబ్బతింటున్నాయో వివరిస్తూ ఓ కాపీరైటర్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు నెలకు ₹2 లక్షలు సంపాదించిన అతనికి, ఏఐ సాంకేతికత వల్ల ప్రాజెక్టులన్నీ తగ్గిపోయి ఆదాయం భారీగా పడిపోయింది.దీంతో ప్రస్తుతం తెలంగాణ టూరిజం బాధ్యతలు చూసే ఓ ఏజెన్సీలో నెలకు కేవలం ₹40 వేల జీతానికి చేరినట్లు తెలిపారు.
గతంలో కంటే పెద్ద బాధ్యతతో ఐదుగురు చేయాల్సిన పనిని ఒంటరిగా చేస్తున్నప్పటికీ, ఇంత తక్కువ జీతం రావడం తీవ్రంగా బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఐ వల్ల ఉద్యోగులకు ఎదురవుతున్న సవాళ్లకు ఈ సంఘటన అద్దం పడుతోంది.





