Back to FeedQuickToday Shorts

General
Sep 2, 2026Short Read
వాయిదా వార్తలకు చెక్: ముందుగా చెప్పిన డేట్‌కే సూపర్ స్టార్ 'జైలర్-2'
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'జైలర్-2' సినిమా విడుదలపై గత కొంతకాలంగా వస్తున్న పుకార్లకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ముగింపు పలికింది.
సినిమా వాయిదా పడుతోందన్న వార్తలను ఖండిస్తూ, ముందుగా ప్రకటించినట్లుగానే ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది.
ఈ మేరకు కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
మొదటి భాగం 'జైలర్' ఘనవిజయం సాధించడంతో, ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు, ఇదే దసరా పండగ బరిలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా కూడా పోటీకి దిగుతుండటం విశేషం.





