
నవంబర్ 20న ‘ఆకాశంలో ఒక తార’ థియేటర్లలోకి
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి విడుదల తేదీ ఖరారైంది.
పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
‘‘ఇప్పటివరకు ఈ ప్రయాణం ఎంతో అందంగా సాగింది.
నవంబర్ 20న ఈ కొత్త ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎదురుచూస్తున్నాను..
ఇట్లు మీ కృష్ణ’’ అంటూ తన పాత్రను పరిచయం చేశారు.
ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
జి.వి.
ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ ఛాయాగ్రహణ బాధ్యతలు చేపట్టారు.
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దుల్కర్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.





