Back to FeedQuickToday Shorts

General
Sep 11, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మళ్లీ పట్టాలెక్కుతున్న 'ఇండియన్ 3'.. త్వరలోనే రిలీజ్!
'ఇండియన్ 2' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో 'ఇండియన్ 3' ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కనున్నట్లు సినీవర్గాల సమాచారం.
కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది.
మిగిలిన కొద్దిపాటి వర్క్‌ను కూడా వేగంగా కంప్లీట్ చేసి, వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Tags:#General#National#Shorts




