Back to FeedQuickToday Shorts

General
Sep 5, 2026Short Read
సెప్టెంబర్ 5నే 'టీచర్స్ డే' ఎందుకు జరుపుకుంటారంటే?
భారత మాజీ రాష్ట్రపతి, ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి అయిన సెప్టెంబర్ 5న ప్రతి ఏటా టీచర్స్ డే జరుపుకోవడం వెనుక ఒక ఆసక్తికర నేపథ్యం ఉంది.
1962లో సర్వేపల్లి భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆ ఏడాది ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు విద్యార్థులు, సన్నిహితులు అనుమతి కోరారు.
అయితే, తన పుట్టినరోజును వ్యక్తిగత వేడుకలా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులను గౌరవిస్తూ 'టీచర్స్ డే'గా నిర్వహిస్తే తనకు ఎంతో గర్వకారణంగా ఉంటుందని ఆయన సూచించారు.
ఆయన కోరిక మేరకే అప్పటినుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.





