Back to FeedQuickToday Shorts

General
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సైమ్ అయూబ్‌పై ట్రోలింగ్: 'డకౌట్ కోసమే 7 వేల కి.మీ ప్రయాణించావా!'
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు.
దీంతో సోషల్ మీడియాలో అతడిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.
వాస్తవానికి కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న అతడిని ప్రత్యేకంగా ఈ టెస్ట్ మ్యాచ్ కోసమే రప్పించారు.దాదాపు 7 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన అయూబ్, కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరడంతో అభిమానులు మండిపడుతున్నారు.
"కేవలం డకౌట్ అవ్వడానికే అంత దూరం నుంచి వచ్చావా?" అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో సెటైర్లు వేస్తూ ఏకిపారేస్తున్నారు.
Tags:#General#National#Shorts





