Back to FeedQuickToday Shorts

General
Aug 14, 2026Short Read
చైన్ స్నాచింగ్ కేసుల్లో 8 మంది నిందితుల అరెస్టు.
26 లక్షల విలువైన సొత్తు స్వాధీనం...
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్).
భద్రాది జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్ కేసుల్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 8 మంది నిందితులను అరెస్టు చేయగా,వారి దగ్గర నుంచి సుమారు 150 గ్రాములు ఆరు బంగారు గొలుసులు,మూడు ద్విచక్ర వాహనాలు,స్వాధీనం చేసుకున్నారు.
వాటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ఈ కేసును చేదించిన వారిలో పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్,అశ్వారావుపేట సిఐ నాగరాజు,ఎస్సైలు రాజేష్ కుమార్, రాజు,బాలస్వామి నాదం,దేవ సింగ్, ప్రసాద్,కానిస్టేబుల్ వెంకట్ ధర్మారావు లక్ష్మయ్య రామకృష్ణారెడ్డి బాలకృష్ణ నరసింహారావు, మౌనిక తదితరులు ఉన్నారు.





