Back to FeedQuickToday Shorts

General
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
జిల్లా స్థాయి రగ్బీ పోటీల్లో మహర్షి విద్యా మందిర్ బాలికల ప్రతిభ
పాలకుర్తి, సెప్టెంబర్ 23 (క్విక్ టుడే న్యూస్):
పాలకుర్తి మండలం చెన్నూర్‌లోని మహర్షి విద్యా మందిర్ బాలికల రగ్బీ జట్టు జిల్లా స్థాయి అండర్–15 పోటీల్లో ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం సాధించింది. వివిధ పాఠశాలల జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో మహర్షి విద్యా మందిర్ విద్యార్థినులు క్రీడాస్ఫూర్తితో పోరాడి మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. జట్టు సభ్యుల కృషి, పట్టుదలపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు రగ్బీ జట్టు సభ్యులను అభినందించి, భవిష్యత్ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.



