Back to FeedQuickToday Shorts

General
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
95 కేజీల నుంచి ఫిట్నెస్ వైపు: ఉపాసన వెయిట్ లాస్ సీక్రెట్స్!
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల వెయిట్ లాస్ జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
18 ఏళ్ల వయసులో 95 కేజీల బరువు ఉండటంతో తాను తీవ్రమైన మానసిక వేదనను అనుభవించానని, పెళ్లి సమయంలో నెటిజన్ల నుంచి ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.
బరువు తగ్గే క్రమంలో ఆమె అన్నం, గోధుమలను పక్కనబెట్టి క్రమం తప్పకుండా ఓట్స్ తీసుకోవడం ప్రారంభించారు.
ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, కాలేజీకి కూడా నడిచే వెళ్లేవారు.
ఎంత వ్యాయామం చేసినా ఆహార నియంత్రణ లేకపోతే ఫలితం ఉండదని, తిండిని తగ్గించి లైట్ ఫుడ్ తీసుకోవడమే బరువు తగ్గే అసలైన రహస్యమని ఉపాసన స్పష్టం చేశారు.
Tags:#General#National#Shorts





