Back to FeedQuickToday Shorts

General
Aug 2, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అజింక్యా రహానేకు BCCI పెన్షన్.. ఎంతంటే?
క్విక్ టుడే న్యూస్, స్పోర్ట్స్ :- ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరైన భారత మాజీ టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఇకపై BCCI నుంచి నెలకు రూ.
70 వేల పెన్షన్ అందుకోనున్నారు.
2022లో సవరించిన పెన్షన్ స్కీమ్ ప్రకారం, 25కి పైగా టెస్టులు ఆడి రిటైరైన వారికి ఈ మొత్తం అందుతుంది.
రహానే 85 టెస్టులు ఆడి ఈ 'టాప్ టైర్' లో ఉన్నారు.
ఈ స్కీమ్ ద్వారా మాజీ ఫస్ట్ క్లాస్ ప్లేయర్లకు రూ.
30 వేలు, లోయర్ టైర్ టెస్ట్ ప్లేయర్లకు రూ.
60 వేల చొప్పున 900 మందికి పైగా మాజీ క్రికెటర్లు లబ్ధి పొందుతున్నారు.



