Back to FeedQuickToday Shorts

General
Sep 1, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
జనగామలో ఘనంగా శ్రీ నల్ల పోచమ్మ తల్లి తోట్టెల ఊరేగింపు
జనగామ, ఆగస్టు 31 (క్విక్ టుడే న్యూస్):
జనగామ పట్టణంలో శ్రీ నల్ల పోచమ్మ తల్లి తోట్టెల ఊరేగింపు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక శోభ నడుమ ఘనంగా జరిగింది. నిర్వాహకులు గణిపాక అఖిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి పట్టువస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ, నల్ల పోచమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఊరేగింపును దిగ్విజయం చేశారు.


