Back to FeedQuickToday Shorts

General
Sep 4, 2026Short Read
కుటుంబ సమేతంగా కృష్ణాష్టమి సంబరాల్లో రామ్ చరణ్, ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన తమ ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
తమ పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ వేడుకలకు సంబంధించిన అందమైన ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
'నా కల నెరవేరింది.
ఓం నమో భగవతే వాసుదేవాయ' అని సంతోషం వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఫోటోలో క్లింకార ముఖం కనిపించినప్పటికీ, కవలల ముఖాలను మాత్రం వారు రివీల్ చేయలేదు.
ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.





