Back to FeedQuickToday Shorts

General
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
బుల్లితెరపై రోహిత్ శర్మ సరికొత్త ఇన్నింగ్స్.. హోస్ట్‌గా నేటి నుంచే సందడి!
టీమిండియా మాజీ కెప్టెన్ 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సరికొత్త కామెడీ షో 'ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ' ఈరోజు రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ షో తొలి ఎపిసోడ్లో భారత క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ తో పాటు మరికొందరు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.
ఇప్పటివరకు బ్యాట్‌తో గ్రౌండ్లో సిక్సర్లు కొట్టిన రోహిత్‌ను, ఇప్పుడు టీవీ హోస్ట్‌గా సరికొత్త అవతారంలో చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:#General#National#Shorts





