
డీఎస్పీ కార్యాలయంలో ర్యాగింగ్ నిర్మూలనపై అవగాహన...
క్విక్ టు డే న్యూస్,భద్రాద్రి జిల్లా ప్రతినిధి ..
మణుగూరు డిఎస్పి కార్యాలయంలో ర్యాగింగ్ నిర్మూలన పై అవగాహన సదస్సు స్థానిక డిఎస్పి వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించినట్లు ఎస్సై రావూఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ..ప్రతి విద్యా సంస్థలో పేరెంట్స్ కమిటీ,యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేసి, అందరూ సమిష్టిగా ర్యాగింగ్‌ను అరికట్టేందుకు కృషి చేయాలని సూచించారు.అలాగే విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని,ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించా లని విద్యార్థులు మరియు అధ్యాప కులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, శ్రీ విద్యా కృష్ణవేణి కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు మరియు మణుగూరు ఎస్ఐ పాల్గొన్నారు.





