
భూసమస్యల పరిష్కారానికి రీసర్వేనే మార్గం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వనపర్తి: భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రీసర్వేనే ఏకైక మార్గమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
వనపర్తి కలెక్టరేట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై సమీక్ష నిర్వహించారు.
మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
భూభారతి కింద తొలిదశలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
నక్షాలు లేని 413 గ్రామాల్లోనూ దశలవారీగా సర్వే చేస్తామని చెప్పారు.
ప్రతి భూ పార్సిల్‌కు ప్రత్యేక గుర్తింపు, జియో కోఆర్డినేట్స్‌తో మ్యాపింగ్ చేయనున్నట్లు వెల్లడించారు.
ధరణి సమస్యలను పరిష్కరించి భూధార్ కార్డులు అందించడమే లక్ష్యమన్నారు.
సాదాబైనామాలు, భూ హద్దులు, పాత రికార్డుల లోపాలు, అబాదీ ఆస్తుల సమస్యలను సమగ్ర సర్వే ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు.
రైతులకు శాశ్వత ప్రయోజనం కలిగేలా సర్వేను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.





