Back to FeedQuickToday Shorts

General
Sep 10, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సచిన్ టెస్ట్ రికార్డుల వేటలో జో రూట్!
పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు.
అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్ల జాబితాలో స్టీవ్ వా, పాంటింగ్‌లను అధిగమించి (169 మ్యాచ్‌లతో) మూడో స్థానానికి చేరుకున్నాడు.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (200), జేమ్స్ అండర్సన్ (188) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.మరోవైపు, టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ (15,921) రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా రూట్ (14,208) వేగంగా అడుగులు వేస్తున్నాడు.
రూట్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే సచిన్ పేరిట ఉన్న ఈ రెండు భారీ రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రూట్ ఈ మైలురాళ్లను అందుకుంటాడో లేదో వేచి చూడాలి.



