Back to FeedQuickToday Shorts

General
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సమాజంలో మార్పే అసలైన అప్గ్రేడ్: సోనూ సూద్ వ్యాఖ్యలు
ఇటీవల విడుదలైన ఐఫోన్-16 సిరీస్ మొబైల్స్ కొనుగోలు చేయడానికి స్టోర్ల ముందు జనాలు భారీగా క్యూలు కట్టడంపై ప్రముఖ నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"కొత్త ఫోన్, కొత్త ఈఎంఐ (EMI)..
కానీ పాత బిల్లులు మాత్రం అలాగే ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు.కేవలం ఫోన్లను అప్గ్రేడ్ చేసుకోవడంపైనే ఆసక్తి చూపకుండా, ఒక మంచి మార్పు కోసం అందరం కలిసి అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.
ఒక బెటర్ సొసైటీని నిర్మించుకోవడమే నిజమైన అప్గ్రేడ్ అని సోనూ సూద్ అభిప్రాయపడ్డారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
Tags:#General#National#Shorts





