Back to FeedQuickToday Shorts

General
Sep 11, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మట్టి గణపతి పూజే ఎందుకు శ్రేష్ఠం?.. ఆధ్యాత్మిక వేత్త సామవేదం వివరణ!
భాద్రపద శుద్ధ చవితి రోజున మట్టితో చేసిన వినాయకుడిని పూజించడమే అత్యంత శ్రేష్ఠమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ వెల్లడించారు.
మానవులం పృథ్వీ సంబంధమైన జీవులమని, అందుకే ఆ మట్టి తత్వాన్ని ఆరాధించడం ప్రధానమని ఆయన వివరించారు.పరమశివుడికి పార్థివ లింగార్చన (మట్టి శివలింగం) ఎంత ముఖ్యమో, గణనాథుడికి కూడా మట్టి రూపమే అంత విశిష్టమైనదని పేర్కొన్నారు.
పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడి రూపానికి ప్రాణం పోసినందున, శాస్త్రాల ప్రకారం మట్టి ప్రతిమలనే పూజకు వినియోగించాలని సూచించారు.
Tags:#General#National#Shorts




