
ఆషాఢ ఉత్సవాల్లో సినీనటులు విజయ్, త్రిషలతో బ్యానర్
తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్‌లో నిర్వహిస్తున్న మారియమ్మన్ ఆలయ ఆషాఢ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది.
ఈ బ్యానర్లో కోలీవుడ్ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను పది తలల రావణాసురుడి రూపంలో, ప్రముఖ నటి త్రిషను అమ్మవారి రూపంలో చిత్రీకరించారు.
ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
విషయం పోలీసుల దృష్టికి చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు.
వివాదాస్పద బ్యానర్‌ను తొలగించి, దానిని ఏర్పాటు చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
కాగా, విజయ్, త్రిష పేర్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వివిధ ప్రచారాల నేపథ్యంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నప్పటికీ, వాటిపై ఇద్దరూ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.





