Back to FeedQuickToday Shorts

General
Aug 3, 2026Short Read
బాలీవుడ్లో ఐకమత్యం కరువైంది: సంజయ్ దత్
క్విక్ టుడే న్యూస్, సినిమా :- బాలీవుడ్ పరిశ్రమలో ప్రస్తుతం ఒకప్పటిలా ఐకమత్యం లేదని ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఆవేదన వ్యక్తం చేశారు.
తన కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీ ఒక కుటుంబంలా ఉండేదని, అందరూ కలిసికట్టుగా, ఒకరికొకరు సాయం చేసుకునేవారని ఆయన గుర్తుచేసుకున్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.హాలీవుడ్ను ఉదహరిస్తూ, అక్కడ అందరూ ఐక్యంగా ఉంటారని, ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉంటుందని, ఒకరిపై ఒకరికి అసూయ ఉండదని ఆయన పేర్కొన్నారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంజయ్ దత్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.





