Back to FeedQuickToday Shorts

General
Sep 4, 2026Short Read
హీరోయిన్ల అభ్యంతరకర సీన్లు: ఘాటుగా స్పందించిన తాప్సీ పన్ను
'పెద్ది', 'టాక్సిక్' వంటి చిత్రాల్లో హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపించడంపై వస్తున్న వివాదంపై నటి తాప్సీ స్పందించారు.
ప్రేక్షకులు కోరుకునేదే తీస్తున్నామంటూ నిర్మాతలు ఆడియన్స్‌పై సాకులు చెప్తారని ఆమె మండిపడ్డారు.
ప్రస్తుతం కలెక్షన్లపైనే దృష్టి పెట్టి కథ, నటనకు ఇచ్చే ప్రాధాన్యం తగ్గించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితి మారాలంటే ప్రేక్షకుల మద్దతు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
కేవలం సోషల్ మీడియాలో విమర్శించడమే కాకుండా, ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలను వైరల్ చేసే బ్యాచ్ కూడా ఆన్లైన్లో ఉందంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కళకు, ప్రతిభకు గుర్తింపు దక్కేలా పరిశ్రమలో మార్పు రావాలని స్పష్టం చేశారు.





