Back to FeedQuickToday Shorts

General
Aug 3, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
కవితపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
క్విక్ టుడే న్యూస్,తెలంగాణ :- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి కవితపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కవిత వేరే మార్గాన్ని ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు.'పార్టీ ఆమెకు తగినన్ని అవకాశాలు ఇచ్చింది.
ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసింది.
కేసీఆర్ రాష్ట్రం కోసం తన జీవితాన్నే ధారపోశారు.
అలాంటి వ్యక్తిపై దాడి చేయాలనుకుంటే మీకు, ప్రత్యర్థులకు తేడా ఏముంది?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
అన్ని అవకాశాలు ఇచ్చినా కృతజ్ఞత లేకుండా, పార్టీ అధినేతనే విమర్శిస్తానంటే..
అలానే కానివ్వండి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.



