
‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో ఇద్దరు యువకులకు గాయాలు
హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశ్రుతి చోటుచేసుకుంది.
భారీగా తరలివచ్చిన అభిమానులు, విద్యార్థుల్లో కొందరు స్టేజ్‌ను చూసేందుకు ఫ్లడ్‌లైట్లు, సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసిన ఇనుప పోల్స్‌పైకి ఎక్కారు.
బరువు ఎక్కువ కావడంతో ఓ సౌండ్ బాక్స్ పోల్ కూలిపోవడంతో స్వల్ప తొక్కిసలాట జరిగి ఇద్దరు యువకులు గాయపడ్డారు.
ఘటన సమయంలో హీరో యశ్ వేదికపై ప్రసంగిస్తున్నారు.
ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే ప్రసంగాన్ని నిలిపివేసి, అందరూ సురక్షితంగా ఉన్నారా అని ఆరా తీశారు.
లైటింగ్ స్టాండ్లు, మైక్ పోల్స్‌పై ఉన్నవారు కిందకు దిగాలని అభిమానులను కోరారు.
సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
భద్రతా ప్రమాణాలు, జన నియంత్రణ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్, చిత్ర యూనిట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





