Back to FeedQuickToday Shorts

General
Sep 2, 2026Short Read
బీపీ టాబ్లెట్ స్కిప్ చేస్తే ప్రమాదం!
బీపీ టాబ్లెట్‌ను ఒక్క రోజు మానేస్తే ఏమీ కాదనేది చాలామంది అపోహ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల ఈ విషయంపై 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రజలకు అవగాహన కల్పించారు.బీపీ మాత్రలు ఏ రోజుకారోజే పని చేస్తాయని, వాటిని వేసుకోవడం మానేస్తే రక్తపోటు ఒక్కసారిగా పెరిగి ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
చాలామంది తమ సొంత నిర్ణయాలతో మందులు వాడటం ఆపేస్తుంటారని, ఇది అత్యంత ప్రమాదకరమని డాక్టర్ మిర్యాల వివరించారు.
ఎవరైనా సరే వైద్యుల సూచనల మేరకే నడుచుకోవాలని, క్రమం తప్పకుండా ప్రతిరోజూ బీపీ మందులు వాడాలని ఆయన సూచించారు.
ఇలాంటి సొంత వైద్యాల జోలికి పోవద్దని డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల ప్రజలను కోరారు.





