Back to FeedQuickToday Shorts

General
Sep 15, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మొబైల్ అలారంతో ఉలికిపడి లేస్తున్నారా? అయితే ఈ ముప్పు తప్పదు!
ఉదయాన్నే సమయానికి నిద్రలేచేందుకు చాలామంది మొబైల్ ఫోన్లలో అలారం పెట్టుకుని, దానిని బెడ్‌పైనే పక్కన ఉంచుకుని పడుకుంటారు.
కానీ, ఇలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫోన్‌ను చెవికి దగ్గరగా ఉంచుకోవడం వల్ల, అలారం మోగగానే అకస్మాత్తుగా ఉలికిపడి నిద్రలేస్తారు.
దీనివల్ల తీవ్రమైన ఒత్తిడి, హైబీపీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా రోజుకు 7 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయే వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
అందుకే నిద్రించే సమయంలో మొబైల్‌ను శరీరానికి దూరంగా ఉంచాలి.
అలాగే అలారం సౌండ్ ఒక్కసారిగా పెద్దగా కాకుండా, ముందుగా తక్కువ శబ్దంతో మొదలై క్రమంగా పెరిగేలా ఉండే రింగ్‌టోన్స్‌ను సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.



