
రికార్డు అమ్మకాలతో వెంకటరమణ బజాజ్ ఆటో షోరూంలో సంబరాలు
తొర్రూరు,ఆగస్టు 03:
పట్టణంలోని వెంకటరమణ బజాజ్ ఆటో షోరూంలో జూలై నెలలో నమోదైన రికార్డు స్థాయి అమ్మకాల సందర్భంగా సోమవారం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో జూలై నెలలో 570కు పైగా ఆటోలు, వాటిలో 100 ఎలక్ట్రిక్ ఆటోలు విక్రయించిన సందర్భంగా షోరూం మేనేజర్ అన్నం అశోక్ ఆధ్వర్యంలో పలు ఆటో స్టాండ్ల వద్ద ఆటో డ్రైవర్లతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మేనేజర్ అన్నం అశోక్ మాట్లాడుతూ..
వినియోగదారులు,ఆటో డ్రైవర్లు చూపుతున్న విశ్వాసమే ఈ విజయానికి కారణమని తెలిపారు.
నాణ్యమైన సేవలు, ఆకర్షణీయమైన ఫైనాన్స్ సదుపాయాలు, మెరుగైన అమ్మకాల అనంతర సేవల వల్లే ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, షోరూం సిబ్బంది, వినియోగదారులు పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.





