Back to FeedQuickToday Shorts

General
Sep 14, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పా? 'ఎండోమెట్రియోసిస్' సంకేతం కావచ్చు!
మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి సాధారణమే అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు.
అయితే నొప్పి విపరీతంగా ఉంటే అది 'ఎండోమెట్రియోసిస్' అనే ఆరోగ్య సమస్య కావచ్చు అని గైనకాలజిస్టులు చెబుతున్నారు.గర్భాశయం లోపల పెరగాల్సిన కణజాలం దాని వెలుపల పెరగడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు.
ఈ వ్యాధి వల్ల భవిష్యత్తులో సంతానలేమి (ఇన్ఫెర్టిలిటీ) వంటి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
అందుకే నెలసరి సమయంలో నొప్పి తీవ్రంగా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన వైద్య సలహాలు పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tags:#General#National#Shorts





