Back to FeedQuickToday Shorts

General
Aug 5, 2026Short Read
షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు.. చంపేసిన పర్లేదంట!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు.
తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ, దేశ ప్రజల కోసం తిరిగి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు.
ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, "నాపై ఎన్ని కేసులు పెట్టినా నన్ను ఆపలేవు.
నన్ను జైల్లో వేయవచ్చు లేదా చంపవచ్చు.
కానీ, నేను మాత్రం నా దేశానికి తిరిగి వెళ్తాను," అని ఉద్వేగంగా చెప్పారు.తాను అధికారం కోసం కాకుండా, బంగ్లాదేశ్లో శాంతి, అభివృద్ధి, ప్రజల భద్రత కోసం తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు.
"నా దేశాన్ని మళ్లీ సరైన మార్గంలో పెడతాను.
నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది," అని ధీమా వ్యక్తం చేశారు.
తన ప్రసంగంలో దేశంలో జరిగిన అల్లర్లను తలచుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
ఈ ప్రసంగం ఆడియోను ఆమె మీడియాతో పంచుకున్నారు.





