
సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాకా’.. విడుదల తేదీ ఖరారు
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కాకా’ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం..
2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో సినిమా విడుదలపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ (కె.ఎస్.
రవీంద్ర) కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘కాకా’పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.
సంక్రాంతి సీజన్లోనే వీరిద్దరి గత చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
రిలీజ్ డేట్‌తో పాటు త్వరలోనే తొలి సింగిల్‌ను కూడా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.
తాజా ప్రకటనతో మెగా అభిమానుల్లో సినిమా సందడి మొదలైంది.





