
గర్భిణిగానే కెమెరా ముందుకు సమంత
మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్న నటి సమంత మరోవైపు వృత్తిపరమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఆమె ప్రస్తుతం ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ షూటింగ్లో పాల్గొంటున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇందుకోసం ఆమె చెన్నై వెళ్లినట్లు సమాచారం.
సమంత ప్రస్తుతం ఏడో నెలలో ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త షో తన కెరీర్లో ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలకు పూర్తిగా భిన్నమైనదని సమంత గతంలో తెలిపారు.
ఆహారం మనుషులను దగ్గర చేస్తుందని, కొత్త జ్ఞాపకాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు.
అయితే కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీల వివరాలను ఆమె వెల్లడించలేదు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ‘మాస్టర్‌చెఫ్’ ఫార్మాట్ ఆధారంగా ఈ షో రూపొందుతోంది.
తమిళ సినీ ప్రముఖులు వంటల పోటీలో పాల్గొననున్నారు.
బనిజయ్ ఆసియా నిర్మిస్తున్న ఈ కార్యక్రమం త్వరలో సోనీ విళా, సోనీ లివ్‌లో ప్రసారం కానుంది.
మరోవైపు సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తొలి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నారు





