Back to FeedQuickToday Shorts

General
Jul 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వర్షాల కోసం పలు ఆలయాల్లో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు
హుస్నాబాద్, జూలై23(క్విక్ టుడే న్యూస్):
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం, అయ్యప్ప ఆలయం, శ్రీకృష్ణ దేవాలయం, మరకత శివాలయాల్లో పూజలు, వరుణ యాగంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, జలాశయాలు నిండాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. రైతు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.



