
రేగ కాంతారావు విజయాన్ని అడ్డుకోలేరు...
బీ ఆర్ ఎస్ పార్టీ మణుగూరు మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎస్కే జావిద్ పాషా.
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్).
మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, రానున్న ఎన్నికల్లో విజయాన్ని కాంక్షిస్తూ ప్రజల గౌరవాన్ని, అభిమానాన్ని పొందుతున్న వ్యక్తిపై బురదజల్లే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎస్కే జావిద్ భాష శుక్రవారం ఒక ప్రకటన లో తీవ్రంగా ఖండించారు.
గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లో ప్రభుత్వ విప్ గా పనిచేసిన రేగా కాంతారావు కి ఒక సాధారణ మహిళ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.
ఇది కావాలని కొందరు దుష్టశక్తులు ఆయన ఎదుగుదలను జీర్ణించుకోలేక ఒక మహిళను అడ్డుపెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎవరెన్ని పన్నాగాలు పన్నినా రానున్న రోజుల్లో రేగా కాంతారావు విజయాన్ని అడ్డుకోలేరు అని విశ్వాసాన్ని వెలిబుచ్చారు.





