Back to FeedQuickToday Shorts

General
Aug 23, 2026Short Read
తెలుగు ప్రేక్షకులపై యశ్ ప్రశంసల జల్లు!
కన్నడ స్టార్ హీరో యశ్ తెలుగు ప్రేక్షకులపై ప్రశంసల వర్షం కురిపించారు.
తెలుగు ఆడియన్స్ ఎంతో నిజాయితీపరులని, ఏ ఇండస్ట్రీ వారైనా ప్యాషన్‌తో పనిచేస్తే ఇక్కడ తప్పక ఆదరిస్తారని కొనియాడారు.
తన లాంటి సాధారణ వ్యక్తిని కూడా గొప్పగా ప్రోత్సహిస్తారని అన్నారు.ఇక్కడ బాండరీలు, రాజకీయాలు, భాషా భేదాలు ఏవీ ఉండవని, కేవలం మానవత్వం, ప్రేమ మాత్రమే ఉంటాయని యశ్ పేర్కొన్నారు.
మా కన్నడిగులకు కూడా ఇలాంటి అభిమానమే ఉంటుందని, తాము కూడా తెలుగు సినిమాలను ఎంతో ఇష్టపడతామని తెలుగులో మాట్లాడి అభిమానులను ఆకట్టుకున్నారు.





