
‘ది ప్యారడైజ్’లో కేసీఆర్‌ను పోలిన పాత్ర
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాతో కమెడియన్ కమ్ కథానాయకుడు ప్రియదర్శి పులికొండకు మంచి గుర్తింపు లభిస్తోంది.
సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో కనిపించిన ఆయన లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రియదర్శి ముక్కు, హెయిర్‌స్టైల్‌ను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను గుర్తు చేసేలా డిజైన్ చేశారు.
సినిమా విడుదలకు ముందు ఆయన పాత్రను చిత్రబృందం రహస్యంగా ఉంచింది.
ప్రోస్థెటిక్ మేకప్‌తో లుక్‌ను మార్చిన ప్రియదర్శి..
పాత్రకు తగ్గ నటనతో ప్రశంసలు అందుకుంటున్నారు.
దీంతో భవిష్యత్తులో కేసీఆర్ బయోపిక్ తెరకెక్కితే ప్రియదర్శి పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
‘బలగం’తో హీరోగానూ మెప్పించిన ప్రియదర్శి..
‘ది ప్యారడైజ్’లో మరోసారి తన నటనా సామర్థ్యాన్ని చాటుకున్నారని అభిమానులు అంటున్నారు.
మరోవైపు సోనీలివ్లోని ‘మయసభ’లోనూ కేసీఆర్‌ను పోలిన పాత్ర కనిపించనుంది.





