Back to FeedQuickToday Shorts

General
Aug 4, 2026Short Read
వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: ఈ తప్పులు చేస్తే మీ అకౌంట్ బ్లాక్ కావచ్చు!
క్విక్ టుడే న్యూస్, ఆగష్టు 5 :- కొంతమంది వాట్సాప్ వినియోగదారులకు మెటా సంస్థ షాకిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన అకౌంట్లను 'అండర్ రివ్యూ'లో ఉంచి, 24 గంటల పాటు బ్లాక్ చేస్తోంది. కాబట్టి యూజర్లు జాగ్రత్తగా ఉండాలి.
ఎలాంటి తప్పులు చేయకూడదు?.. చట్టవిరుద్ధమైన, ద్వేషపూరిత లేదా అశ్లీల కంటెంట్‌ను ఇతరులతో షేర్ చేయకూడదు.అనధికారిక వాట్సాప్ వెర్షన్లు వాడకూడదు.ఒకే మెసేజ్‌ను ఒకేసారి ఎక్కువ మందికి పంపడం మానుకోవాలి.మీ నంబర్‌ను తక్కువ సమయంలో ఎక్కువ మంది బ్లాక్ చేయడం లేదా మీకు ఒకేసారి పెద్ద సంఖ్యలో మెసేజ్‌లు రావడం లాంటివి జరిగినా అకౌంట్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది.ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, వాట్సాప్‌ను సురక్షితంగా ఉపయోగించండి.





