
‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకకు చిరంజీవి
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’.
తమిళనాడు సీఎం, నటుడు విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక రేపు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరగనుంది.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
జేసన్ సంజయ్ తొలి చిత్ర వేడుకకు చిరంజీవి రావడంతో ఈ ఈవెంట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
రూ.500 కోట్ల నేపథ్యంతో సాగే క్రైమ్, గ్యాంబ్లింగ్, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది.
ఎస్.
థమన్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘సిగ్మా’ను మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేయనుంది.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.





