
కమలా రెడ్డిగా రమ్యకృష్ణ బీభత్సం.. 'డేవిడ్ రెడ్డి' నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల!
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ చిత్రం 'డేవిడ్ రెడ్డి'.
ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ అత్యంత శక్తివంతమైన, భయానక పాత్రలో నటిస్తున్నారు.
ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన క్యారెక్టర్ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ పోస్టర్లో రమ్యకృష్ణ చేతిలో రక్తం తడిసిన కత్తి పట్టుకుని, డెడ్బాడీలపై కాలుపెట్టి సింహాసనంపై అధిష్టించిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
'కమలా రెడ్డి'గా ఆమె గెటప్ చూస్తుంటే సినిమాలో ఆమె పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండనుందో స్పష్టమవుతోంది.
మరోవైపు 'శ్రీశ్రీ' సినిమాలోని లుక్ను కూడా రివీల్ చేయడంతో, రమ్యకృష్ణ బర్త్డే కానుకగా వచ్చిన ఈ అప్డేట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.





