Back to FeedQuickToday Shorts

General
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వెస్టిండీస్ సిరీస్‌కు రోహిత్ శర్మ కఠిన ప్రాక్టీస్
రాబోయే వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రాక్టీస్‌ను ప్రారంభించారు.
బెంగళూరులోని బీసీసీఐ COE (Centre of Excellence) కేంద్రంలో కోచింగ్ స్టాఫ్ పర్యవేక్షణలో ఆయన తీవ్రంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
గత రెండు రోజులుగా జరిగిన బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్లలో రోహిత్ శర్మ పాల్గొని షాట్లను సాధన చేశారు.లాస్ట్ ఇంగ్లండ్ వన్డే మ్యాచ్‌లో లార్డ్స్ వేదికగా అద్భుతమైన సెంచరీ సాధించిన హిట్ మ్యాన్, అదే సూపర్ ఫామ్‌ను వెస్టిండీస్‌తో ఈ నెల 27న ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లోనూ కొనసాగించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
రోహిత్ శర్మ రాణిస్తే ఈ సిరీస్‌లో భారత్‌కు విజయం తథ్యమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.



